ప్రజాగ్రహం
ప్రైవేటీకరణపై
కదం తొక్కిన జిల్లా ప్రజలు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
చోడవరంలో నిర్వహించిన భారీ ర్యాలీ, (ఇన్‌సెట్) వైఎస్సార్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు
అనకాపల్లిలో పాదయాత్రగా వెళుతున్న సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ సత్యవతి, దంతులూరి దిలీప్‌కుమార్
పోలీసుల అడ్డంకులను అధిగమించి నిరసనలు నర్సీపట్నంలో బారికేడ్లతో మోహరించిన పోలీసులు అయినా ఎక్కడా తగ్గకుండా పాదయాత్రగా ర్యాలీ
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పేరుతో ప్రై‘వేటు’ వేసే జీవోను రద్దు చేయాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహోద్యమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రజా ఉద్యమం’ పేరిట పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజలకు చంద్రబాబు హయాంలో అన్ని విధాలుగా అన్యాయమే జరిగిందని.. మెడి‘కిల్’ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు. నర్సీపట్నంలో ర్యాలీకి అనుమతి లేదని పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు ముందురోజు నోటీసు జారీ చేసిన పోలీసులు బుధవారం ఉదయం నుంచే పట్టణంలో భారీగా మోహరించారు. అయినప్పటికీ ప్రజలు నిరసన ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే స్పందన కనిపించింది.
చోడవరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. చోడవరం కాలేజి జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు కిలోమీటరన్నర మేర పాదయాత్రగా ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏరువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జెడ్పీటీసీలు మారిశెట్టి విజయ శ్రీకాంత్, పోతల లక్ష్మీ శ్రీనివాస్, ఎంపీపీలు గాడి కాసు అప్పారావు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దేవి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. తహసీల్దార్ రమాదేవికి వినతిపత్రం సమర్పించారు. పార్టీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఎంపీపీలు తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, కురచా జయమ్మ, చింతల బుల్లిలక్ష్మి, రెడ్డి జగన్మోహన్, చోడవరం సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ స్టేడియం వద్ద మహాత్మగాంధీ విగ్రహం నుంచి అబిద్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల ఎర్రాపాత్రుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షరాలు లోచల సుజాత, మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, గజ్జలపు మణికుమారి, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
అనకాపల్లిలో సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సాగింది. రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఏవో లీలావతికి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీ, సీఈసీ సభ్యురాలు డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు జ్ఞాన్‌దీప్ పాల్గొన్నారు.
యలమంచిలిలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఏవీఎన్ కాలేజీ డౌన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, సీఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు, ఎంపీపీలు గొట్టిముక్కల శిరీష, కిషోర్‌రాజు, కోన సంధ్య, జెడ్పీటీసీలు సేనాపతి సంధ్యారాణి, ధూళి నాగరాజు, సోము సత్యానారాయణ,, మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు సత్య గుప్తా పాల్గొన్నారు.
పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రాష్ట్ర కార్యదర్శులు పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం


