అక్రమ మద్యం విక్రేత అరెస్టు
మద్యం సీసాలతో పట్టుబడిన నిందితుడు
రావికమతం: మండలంలోని గొంపలో కొప్పాక నాగేశ్వరరావు(40) అనే వ్యక్తి పాన్‌షాప్‌లో అనధికార మద్యం విక్రయాలు జరుపుతున్నట్టు స్పెషల్ బ్రాంచి పోలీసులకు సమాచారం అందింది. అనకాపల్లి స్పెషల్ బ్రాంచి సీఐ బాల సూర్యరావు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి పోలీసులు మద్యం విక్రయిస్తున్న నాగేశ్వరరావుపై ఆకస్మిక దాడి జరిపి 149 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మద్యాన్ని రావికమతం పోలీసుస్టేషన్‌కు అప్పగించి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.


