రూ.15 వేలు పింఛన్ ఇచ్చి ఆదుకోండి
మంచానికి పరిమితమైన తన కూతురు సాయి భవానికి రూ.15 వేలు పింఛన్ అందించి ఆదుకోవాలని కోరుతూ జీవీఎంసీ విలీన గ్రామం కొండకొప్పాకకు చెందిన డి.రాము కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ అందజేశారు. 90 శాతం అంగ వైకల్యం ఉన్న బిడ్డ సాయి భవానికి నెలకు రూ.6వేలు పింఛన్ మాత్రమే అందుతుందని, పూర్తిగా మంచాన ఉండే బిడ్డ వద్ద మరో మనిషి పూర్తిగా ఉండిపోవాల్సి వస్తుందని, నిరుపేదలమైన తాము కూలిపనులకు కూడా వెళ్లలేని స్థితి ఉందని, నెలకు రూ.15 వేలు పింఛన్ అందించి ఆదుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమామణిని వేడుకున్నారు. – సాయిభవానితో తండ్రి రాము


