రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో గురుకుల విద్యార్థులకు
మెడల్స్ సాధించిన విద్యార్ధులతో
ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్
నర్సీపట్నం: ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పెదబొడ్డేపల్లి గురుకుల విద్యార్థులు మెడల్స్ సాధించారు. అండర్ 17 కేటగిరి 71 కేజీల విభాగంలో షేక్ అబ్దుల్ సిల్వర్ మెడల్, సీహెచ్.కిరణ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి గురుకుల విద్యాలయానికి పేరు తీసుకువచ్చిన విద్యార్ధులు, పీఈటీని ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ అభినందించారు.


