స్కూల్ గేమ్స్‌లో అన్యాయం
ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ గేమ్స్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ మునగపాక మండలం మడకపాలెంకు చెందిన క్రీడాకారిణి బి.ఇందు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఎంజే పురం హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న తాను హరిపాలెంలో జరిగిన పోటీల్లో మొదటి స్థానం, అనకాపల్లి, ఎంజేపురం హైస్కూళ్లలో వేర్వేరుగా జరిగిన పోటీల్లో విన్నర్‌గా నిలిచానని చెప్పారు. దీంతో కొవ్వూరులో జరిగే పోటీలకు ఎంపికై నట్లు చెప్పి చివరి నిమిషంలో తన పేరును జాబితా నుంచి తొలగించి మరొకరిని పంపించారని ఆమె వాపోయింది. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. – క్రీడాకారిణి ఇందు


