యువతకు ఆదర్శనీయం స్వామీ వివేకానంద సందేశం
అనకపల్లి టౌన్/తుమ్మపాల: నేటి యువత స్వామీ వివేకానంద సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. స్ధానిక ఏఎంఏఎల్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ(సెట్విజ్) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామీ వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెకర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ యోగా, ధ్యానం వంటివి వారి దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, గీతాలు, కధ రచన, పెయింటింగ్, కవిత్వం, ఆవిష్కరణ తదితర పోటీల్లో విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు ఆమె అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహక అధికారి కె.కవిత, జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వినోద్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయబాబు, కరస్పాండెంట్ వెంకట రామారావు పాల్గొన్నారు.


