వచ్చే నెల 21న క్షత్రియ కార్తీక వన సమారాధన
అనకాపల్లి: క్షత్రియ సేవ సమితి జిల్లా కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు దంతులూరి దిలీప్‌కుమార్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి విజయ రెసిడెన్సీ హాల్లో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో క్షత్రియ సేవా సమితి స్థలంలో పక్కా భవనం నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. క్షత్రియులందరినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ సహాయంతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా కార్యదర్శి పిన్నమరాజు కిషోర్‌రాజు, కోశాధికారి మంతెన నీలావతి, సభ్యులు దంతులూరి రాజబాబు, పెనుమత్స కృష్ణంరాజు, పిన్నమరాజు శ్రీనివాసరాజు, భూపతిరాజు వర్మ, చేకూరి శ్రీనివాసరాజు, పిన్నమరాజు వాసు, పాకలపాటి రాజా, ఉప్పలపాటి నరసింహరాజు, అచ్యుతరామరాజు, తదితరులు పాల్గొన్నారు.


