సబ్బవరం: మండలంలోని వంగలి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ అఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ)లో సోమవారం పలు భవనాలను ప్రారంభించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై వీటి గృహప్రవేశం, ప్రారంభోత్సవాలను చేపట్టారు. వర్సిటీలోని బాయ్స్ హాస్టల్స్–1, 2, గర్‌ల్స్ హాస్టల్, టైఫ్–8 క్వార్టర్స్, ఈ అండ్ ఎం వర్క్ షాప్, క్యాంటీన్లను ప్రారంభించారు. అనంతరం వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ శాలివాహన, రిజిస్ట్రార్ రాంపాల్ ద్వివేది, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె.పునీత్‌కుమార్, జీఎం జె.రంగారావు, తహసీల్దార్ బి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


