ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులుగా రమణకుమారి, ధనలక్ష్మీ, ఎ.కమల
అనకాపల్లి: ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) 5వ రాష్ట్ర మహాసభలు ముగింపు కార్యక్రమం స్థానిక గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్ ఎదురుగా కర్రి రమేష్ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.రమణకుమారి(నంద్యాల), ప్రధాన కార్యదర్శిగా కె.ధనలక్ష్మి, కోశాధికారిగా ఎ.కమల(విజయనగరం జిల్లా) ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మంది ఆఫీస్ బేరర్స్, 30 మంది యూనియన్ సభ్యులుగా ఎంపికయ్యారు.


