నీటి ప్రవాహంలో ప్రాణాలు అరచేతిలో...
వర్షం వస్తే గిరిజన శివారు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గొర్రిగెడ్డ ప్రవహిస్తే 7 గ్రామాల ప్రజలకు సంబంధాలు తెగిపోతున్నాయి. అధికారులు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత వస్తున్నారు. అయితే నీటి ప్రవాహం వల్ల గ్రామాల్లో గల పాఠశాలలకు ఉపాధ్యాయులు కూడా రాలేదు. ఏటి అవతలి గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యాలి.
– దారపర్తి బాలరాజు, మామిడిపాలెం గ్రామం,
శంకరం పంచాయతీ, మాడుగుల మండలం
పాలకులు పట్టించుకోలేదు..
మా గ్రామం నుంచి రాకపోకలు సాగించడానికి తుఫాన్ వర్షాలు తగ్గిన తర్వాత కూడా మేం ఇబ్బందులు పడుతున్నాం. గత ఏడాది కొత్తవలస గెడ్డ దాటలేక అనారోగ్యంతో యువకుడు మృతి చెందగా, తాడివలస గెడ్డ దాటుతూ గర్భిణి ప్రసవించింది. వర్షాల సమయంలో 108, 104 సర్వీసులు రావడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గిరిజన గ్రామాలు సందర్శించలేదు.
– జన్ని కన్నయ్య, గ్రామస్తులు తాడి వలస
గ్రామం, మాడుగుల మండలం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీలు నెరవేర్చాలి...
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హమీని నెరవేర్చాలి. గత ఎన్నికల ముందు ఎక్కడ పది ఇళ్లు వుంటే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలి. గ్రామాలకు రహదారులు, గెడ్డల మీద వంతెనలు నిర్మించాలి
– ఉండూరు ఈశ్వరరావు, గ్రామస్తులు,
కొత్తవలస, మాడుగుల మండలం
నీటి ప్రవాహంలో ప్రాణాలు అరచేతిలో...
నీటి ప్రవాహంలో ప్రాణాలు అరచేతిలో...


