10 కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
పట్టుకున్న గంజాయితో పోలీసులు
గొలుగొండ: కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం మార్గంలో అక్రమంగా బైక్‌పై గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని ఎస్‌ఐ పి.రామారావు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి హోండా షైన్ నెంబర్ లేని బైక్‌పై మహారాష్ట్రకు చెందిన ఆకాష్ బైరావ్(26) అనే వ్యక్తి గంజాయి తరలిస్తున్న సమయంలో చిన్నయ్యపాలెం వద్ద పట్టుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తరలిస్తున్నట్లు నిందితుడు తెలిపాడన్నారు. అతని వద్ద నుంచి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.


