కొబ్బరి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
బుచ్చెయ్యపేట: మండలంలో గల పొట్టిదొరపాలెం గ్రామంలో కొబ్బరి చెట్టుపై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలివి. వడ్డాది గ్రామానికి చెందిన ముత్యాల శ్రీను(43) కొబ్బరి కాయలు కొని వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం పొట్టిదొరపాలెం గ్రామంలో రైతు దగ్గర కొనుగోలు చేయడానికి వెళ్లి కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి కింద పడిపోయాడు. సంఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ఇతనికి భార్య అమ్మాజీ, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. ఘటనపై బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


