రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Nov 9 2025 7:09 AM | Updated on Nov 9 2025 7:09 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

మాకవరపాలెం: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. మాకవరపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు అర్హత సాధించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో సాఫ్ట్‌బాల్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 10 మంది మాకవరపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం నారాయణరావు శనివారం తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు డి.రవి, చంద్రదేవి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

ఎస్‌.రాయవరం: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మండలం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ధర్మవరం అగ్రహారం ఉన్నత పాఠశాల నుంచి హాకీ పోటీలకు బి.జయశ్రీ, కె.తోనేశ్వరి ఎంపికై నట్టు హెచ్‌ఎం ఎంఎన్‌ఎస్‌ ప్రశాంతి తెలిపారు. కొరుప్రోలు ఉన్నత పాఠశాల నుంచి అండర్‌–14 విభాగంలో పి.వైష్ణవి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు, 48 కేజీల తైక్వాండో పోటీలకు వై.ఆకాష్‌ ఎంపికై నట్టు హెచ్‌ఎం కప్పల ప్రసాద్‌ తెలిపారు. విజేతలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.

చీడికాడ: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మండలలోని దిబ్బపాలెం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మోసూరి లీలావతి ఎంపికై నట్టు ఎంఈవోలు బొంజుబాబు, రమణ తెలిపారు. శుక్రవారం విశాఖలో జిల్లా స్థాయి అండర్‌–14 క్రీడల్లో పాల్గొన్న లీలావతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ందన్నారు.

బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఎస్‌.యమున, ఎస్‌.లత, జి.లక్ష్మణరావు అండర్‌–17 విభాగంలో అర్హత సాధించారు. అండర్‌–14 వాలీబాల్‌ పోటీలో జి.చంద్రిక సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని హెచ్‌ఎం, పీఈటీలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక1
1/5

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక2
2/5

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక3
3/5

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక4
4/5

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక5
5/5

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement