మత్స్యకారులపై కేసులు పెట్టడం సరికాదు
పాయకరావుపేట: నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం మత్స్యకారుల పై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం సక్రమమైన పని కాదని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణానికి నిరసనగా కార్యక్రమాలు చేస్తున్న మత్స్యకారుల పై కేసులు పెట్టి భ్రయబ్రాంతుల్ని చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి మత్స్యకారుల్ని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను మత్స్యకారులు ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


