రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థినికి ఘన సత్కారం
నాతవరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటల పోటీల్లో హైస్కూల్ చెందిన విద్యార్థిని ఎ.స్నేహ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయుడు కాశపు శివరాంప్రసాద్ అన్నారు. చమ్మచింత హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎ.స్నేహ గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీలలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపింది.ఈ విద్యార్థినిని హైస్కూల్‌లో బుధవారం విద్యా కమిటీ చైర్మన్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాజ్యాంగ దినోత్సవవం సందర్భంగా ఈనెల 26వ తేదీన అమరావతి అసెంబ్లీలో స్నేహ ప్రసంగిస్తుందని తెలిపారు.


