ఆలయం గేటుకు తాళం వేసిన అయ్యప్ప భక్తులు
ఎస్.రాయవరం: సకాలంలో ఆలయం తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని సర్వసిద్ధి గ్రామంలో శివాలయం గేటుకు అయ్యప్ప మాలధారణ భక్తులు తాళం వేసి, అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయం గేటుకు తాళం వేయడంతో భక్తులు కాసేపు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు,దేవదాయ శాఖ ఈవో సాంబశివరావు ఆలయానికి చేరుకుని గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని, గుడి తలుపులకు తాళాలు వేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. అనంతరం ఆలయం తెరచి భక్తులకు దర్శనం కల్పించారు. అర్చకుడు పండుకి ఆలయ ఈవో మెమో ఇచ్చారు.


