8 మంది పేకాటరాయుళ్లపై కేసు
యలమంచిలి రూరల్: మండలంలో పులపర్తి శివార్లులో పంటపొలాల్లో పేకాడుతున్న 8 మందిని బుధవారం యలమంచిలి రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక్కడ పేకాడుతున్న సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు వెళ్లగా 8 మంది డబ్బు ఫణంగా పెట్టి పేకాడుతున్నట్టు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.5380 స్వాధీనపర్చుకున్నారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు.


