మొబైల్ ఫోన్ల దొంగ దొరికాడు..
పాయకరావుపేట: మొబైల్ ఫోన్ల దొంగ పోలీసులకు చిక్కాడు. ఇటీవల పట్టణంలో మొబైల్స్‌ను దొంగిలించిన వ్యక్తి, మరోసారి దొంగతనం చేయడానికి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఎస్‌హెచ్‌వో జి.అప్పన్న తెలిపిన వివరాలివి. ఈ నెల 16వ తేదీన పట్టణంలోని రాజుగారిబీడులో ఓ ఇంట్లో రెండు మొబైల్స్, ఒక ఆపిల్ ఇయర్ పాడ్స్ అపహరణకు గురయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో అదే దొంగ మరోసారి సీతారాంపురంలోని ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుడు విశాఖపట్నం, జ్ఞానాపురానికి చెందిన కోట్ల అచ్యుతరామరాజుగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.


