
ఎ.కోడూరు విద్యార్థులకు ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్
కె.కోటపాడు: కె.కోటపాడు హైస్కూల్‌లో ఈ నెల 17, 18లలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడాపోటీల్లో ఎ.కోడూరు హైస్కూల్‌కు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ఉత్తమ ప్రతిభను చూపారు. వివిధ క్రీడల్లో బాలురు మంచి ప్రతిభను కనబర్చడంతో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆల్ రౌండ్ చాంపియన్‌షిప్ అర్హతను సాధించగా, బాలికలు పలు క్రీడా విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో గర్‌ల్స్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను సాధించినట్టు పీఈటీలు కె.చిట్టి ప్రసాద్, స్వామినాయుడు తెలిపారు. బాలుర విభాగంలో అండర్–17 విభాగంలో వాలీబాల్‌లో విన్నర్, బ్యాట్మింటన్‌లలో విన్నర్‌లుగా నిలవగా, ఖో–ఖోలో రన్నర్స్‌గా నిలిచారు. అండర్–14 విబాగంలో ఖో–ఖోలో విన్నర్‌గాను, వాలీబాల్‌లో రన్నర్‌లుగా నిలిచారు. అథ్లెటిక్స్‌లో అండర్–17లో 100 మీటర్లు పరుగు పందెంలో జి.తేజ మొదటి స్థానంలో నిలవగా, కె.జాన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 200 మీటర్ల పరుగు పందెంలో ఎం.మనోహర్ మొదటి స్థానంలోను, జి.తేజ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 400 మీటర్లు పరుగు పందెంలో జి.గంగాధర్ మొదటి స్థానంలో నిలవగా, కె.జాన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 800 మీటర్లు పరుగు పందెంలో డి.హరీష్ ద్వితీయ స్థానంలో నిలవగా, ఎం.పూర్ణచంద్రనాయుడు తృతీయ స్థానంలో నిలిచాడు. 1500 మీటర్లు పరుగు పందెంలో డి.హరీష్ మొదటి స్థానంలో నిలవగా, పి.కుమార్ రెండవ స్థానంలో నిలిచాడు. అండర్–14 బాలుర విభాగంలో కె.మనోహర్ మొదటి స్థానంలో నిలిచాడు. 200 మీటర్ల పరుగు పందెంలో కె.మోహన్ మొదటి స్థానంలో నిలవగా, సిహెచ్.మనోహర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 400 మీటర్ల పరుగు పందెంలో వి.చంద్రకిరణ్ మొదటి స్థానంలో నిలవగా, సిహెచ్.మనోహర్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 600 మీటర్లు పరుగు పందెంలో వి.చంద్రకిరణ్ మొదటి స్థానంలో నిలవగా జి.సాయి శంకర్ రెండో స్థానంలో నిలిచాడు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూప డం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు ఎ.శేఖర్ తెలిపి విద్యార్థులను అభినందించారు.