
భారీ వర్షానికి పొంగుతున్న ఏరులు
మాడుగుల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్ వరి చేలు కూడా పొట్టదశకు చేరుకోవడంతో ఖరీఫ్ పంటలకు ఢోకాలేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్ సాధారణ వరి సాగు 50 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ఎరువుల కొరతతో చేలు పనికిరాలేదని , దిగుబడులు అంతగా రావని రైతులు దిగులు చెందుతున్నారు. ఈ వర్షాలు మెట్టు సాగుకు కూడా ఉయోగపడుతుందని, రైతులు చెబుతున్నారు.జలాశయాల్లో పుష్కలంగా వరద నీరు చేరడంతో ఏరుల్లోకి వరద నీరు విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు పశువులను దింపరాద, నదుల దగ్గరకు వెళ్లరాదని మాడుగుల తహసీల్దార్ రమాదేవి హెచ్చరికలు చేశారు.

భారీ వర్షానికి పొంగుతున్న ఏరులు

భారీ వర్షానికి పొంగుతున్న ఏరులు