
ఆలిండియా యోగా పోటీలకు ఎంపిక
నందినిని అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మోహన్‌రావు
మాకవరపాలెం: ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీలకు తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఎంపికై ంది. విజయనగరం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో తగరపువలసలో నిర్వహించిన సౌత్ జోన్ యోగా పోటీల్లో సీఎస్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంచాడ నందిని ప్రతిభ చూపి ఆలిండియా పోటీలకు ఎంపికై ంది. ఈమెను కళాశాల ప్రిన్సిపాల్ సి.మోహన్‌రావు శుక్రవారం అభినందించారు. నవంబర్ 24 నుంచి 28వ తేదీ వరకు బెంగళూరులో జరిగే అంతర్ విశ్వ విద్యాలయాల యోగా పోటీల్లో పాల్గొననున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పోటీల్లోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా ట్రైనర్ చంద్రిక పాల్గొన్నారు.