
స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇవ్వం
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ రామస్వామి సొంతం
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు కాబోతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు తమ గ్రామంలో భూములు ఇవ్వబోమని నెల్లిపూడి రైతులు స్పష్టం చేశారు. శనివారం వారంతా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వి.వి.రమణను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లిపూడి గ్రామంలో సుమారు 200 ఎకరాల భూములు స్టీల్‌ప్లాంట్ లేబర్ కాలనీ కోసం సేకరిస్తున్నట్లు తహసీల్దార్ ద్వారా తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ కోసం గుర్తించిన భూములపై తరతరాలుగా రైతులు ఆధారపడి సాగు చేసుకుంటున్నారన్నారు. పచ్చని కొబ్బరి తోటలతో మరో కోనసీమగా ప్రసిద్ధి పొందిన తమ భూములను స్టీల్‌ప్లాంట్ కోసం ఇవ్వడానికి నిరాకరిస్తున్నామన్నారు. భూములు కోల్పోతే రైతులంతా ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కొబ్బరి తోటలపై రైతులతోపాటు వ్యవసాయ కూలీలు, ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. తమ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ఆర్డీవోను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, రైతులు చినపేర్రాజు, సురేష్‌రాజు, రామచంద్రరాజు, వెంకటపతిరాజు, ఎరిపిల్లి చిన అబ్బాయి, లక్ష్మీపతిరాజు, రాకాతి అన్నవరం, రావి చిన్న తదితరులు ఉన్నారు.
ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చిన నెల్లిపూడి రైతులు
ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా నకిలీ డాక్యుమెంట్లు
ఏకంగా నకిలీ ఈసీసృష్టించిన ముఠా
విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఇద్దరు డీఈల నిర్వాకం