
జీఎస్‌ఐతో ఏయూ ఒప్పందం
మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి రంగంలో మరో ముందడుగు వేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)తో ఏయూ శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఏయూ తరఫున రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సత్య నారాయణ మహాపాత్రో సంతకాలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఇతర ప్రతినిధులు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎంవీఆర్ రాజు, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య ఈన్ ధనుంజయ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.