సబ్‌ జైల్‌లో సమస్యలపై జడ్జి ఆరా | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జైల్‌లో సమస్యలపై జడ్జి ఆరా

Sep 28 2025 7:14 AM | Updated on Sep 28 2025 7:14 AM

సబ్‌ జైల్‌లో సమస్యలపై జడ్జి ఆరా

సబ్‌ జైల్‌లో సమస్యలపై జడ్జి ఆరా

ఖైదీలతో మాట్లాడుతున్న 12వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జ్‌ విజయలక్ష్మి

అనకాపల్లి టౌన్‌: స్థానిక సబ్‌ జైల్‌లో సమస్యలపై 12వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి విజయలక్ష్మి ఆరా తీశారు. శనివారం ఆమె జైలును పరిశీలించారు. ఈ సందర్భంగా నిందితులతో మాట్లాడారు. ఖైదీలు కోరితే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఖైదీలకు నాణ్యమైన ఆహారం పెట్టాలని, జైలులో పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ కిరణ్‌, న్యాయ సహాయకులు సాయిరాం, తులసీ రామ్‌, ఎంఎల్‌ఎస్‌సీ ప్రతినిధి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement