మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల

Sep 25 2025 7:19 AM | Updated on Sep 25 2025 7:19 AM

మత్స్

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల

పది రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని హోంమంత్రి

తమను పట్టించుకోకపోగా స్టీల్‌ప్లాంట్‌పై సమావేశం పెట్టడంతో రగిలిపోయిన గంగపుత్రులు

రోడ్డుపై నిప్పు పెట్టి రాకపోకలు నిలిపివేత

బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ వాహనాల అడ్డగింత

భారీగా మోహరించిన పోలీసులు

ఇరు వర్గాల మధ్య తోపులాట

రాత్రి పొద్దు పోయాక కూడా దీక్ష కొనసాగిస్తున్న మత్స్యకారులు

టెంటు వేయవద్దన్నా వెరవలేదు.. మైకు పెట్టవద్దనా పట్టించుకోలేదు.. నిరశన తెలపడమే ముఖ్యమనుకున్నారు.. ముందు మండుటెండలో, తర్వాత గొడుగుల కింద, నాలుగు రోజులు గడిచాక టెంట్ల కింద శాంతియుతంగా నిరాహార దీక్షలు కొనసాగించారు. బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ వేడుకుంటున్నారు. కానీ పది రోజులైనా తమను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంమంత్రి స్టీల్‌ప్లాంట్‌పై సమావేశం పెట్టారని తెలిశాక మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. తమ ప్రజాప్రతినిధి నిర్లక్ష్య భావంపై రగిలిపోయారు.

నక్కపల్లి: గుండెల్లో మంట ఆగ్రహ జ్వాలగా మారింది. మంట పెట్టి రహదారిని దిగ్బంధం చేసింది. బల్క్‌డ్రగ్‌ పార్కు పనులను అడ్డుకుంది. ఇది పది రోజులుగా నిరశన తెలుపుతున్న గంగపుత్రుల ఆవేదన. ఎన్నికల ముందు రాజయ్యపేట ఓట్ల కోసం వచ్చిన వంగలపూడి అనిత బల్క్‌డ్రగ్‌ పార్కుకు, సముద్రంలోకి కంపెనీల వ్యర్థ జలాల విడుదల కోసం వేస్తున్న పైపులైన్లకు తాను వ్యతిరేకమని ఓట్లు అడిగారు. ఆమెకు రాజయ్యపేట గ్రామ ప్రజలు 2 వేల మెజార్టీ ఇచ్చారు. అంత మద్దతిచ్చినా ఆమె కనీసం తమ గోడు వినడానికై నా రాలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అది బుధవారంనాటి పరిణామాలతో ఆగ్రహంగా మారింది. ఆర్సిలరీ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై ఈనెల 27న నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేయాలని సంబంధిత గ్రామాల పెద్దలతో హోంమంత్రి అనిత సమావేశం జరిపారని తెలుసుకున్న గంగపుత్రులు మరింత కోపంతో ఊగిపోయారు. తమ ఆవేదనకు విలువ ఇవ్వనందుకు నిరసనగా బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. రోడ్డుపై నిప్పు పెట్టి రాకపోకలు బ్లాక్‌ చేశారు. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నక్కపల్లి, ఎస్‌.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు గ్రామంలోకి వెళ్లారు. నూకతాత ఆలయం వద్ద టెంటు వేసి ఆందోళన కొనసాగిస్తున్న మత్స్యకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మద్దతు తెలిపారు. కాకినాడ సమీపంలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు సిద్ధపడిన దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వారు ఉప్పాడలో రోడ్డెక్కి ఆందోళన చేస్తే అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారని, వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారని మత్స్యకారులు పేర్కొన్నారు. ఇక్కడ రాజయ్యపేట మత్స్యకారులు పది రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా అనిత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, తమతో చర్చలు జరపలేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. రాత్రి పొద్దుపోయాక కూడా దీక్షలు కొనసాగించారు.

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల 1
1/2

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల 2
2/2

మత్స్యకారుల్లో ఆగ్రహ జ్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement