
భక్తుల విశ్వాసాలకు విఘాతం
ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే కల్యాణోత్సవాల్లో వేలాది మంది భక్తులు బంధుర సరస్సులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం అనాదిగా వస్తోంది. ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. అంత పవిత్రంగా ఈ చిన్న చెరువును భావిస్తారు. దీన్ని ఆనుకుని ఉన్న పెద్ద చెరువుపై గ్రామానికి చెందిన కొంతమంది పెద్దల కళ్లు పడ్డాయి. గ్రామాభివృద్ధి పేరుతో చేపలు పెంచుకునేందుకు లీజుకు ఇవ్వడానికి నిర్ణయించారు. చాలా రోజుల నుంచి ఈ ఆలోచన ఉన్నప్పటికీ కొంతమంది నుంచి వ్యతిరేకత రావడం, భక్తుల నుంచి కూడా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో వాయిదా వేశారు. శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా దేవస్థానం వారికి తెలియకుండా కొంతమంది పెద్దలు సమావేశమై చెరువుకు వేలం నిర్వహించినట్లు భోగట్టా. మూడేళ్ల కాలపరిమితికి రూ.7 లక్షలకు ఉపమాకకు చెందిన ఒక వ్యక్తి ఈ లీజు హక్కు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా రూ.2 లక్షలు గ్రామ పెద్దలకు చెల్లించిన తర్వాత చెరువులో చేపపిల్లలు వేసుకోవాలనే కండీషన్ విధించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. భక్తుల సెంటిమెంట్‌లను గౌరవించాల్సిన పెద్ద మనుషులే ఇలా అపచారానికి ఒడిగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు.

భక్తుల విశ్వాసాలకు విఘాతం