
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవి
గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న యూపీ అదనపు డీజీపీ సత్యనారాయణ
నర్సీపట్నం: తెలుగు సాహిత్యాన్ని మహాకవి గురజాడ అప్పారావు సుసంపన్నం చేశారని యూపీ అదనపు డీజీపీ కిల్లాడ సత్యనారాయణ అన్నారు. స్థానిక శాఖాగ్రంథాలయంలో ఆదివారం గురజా డ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషి చేసిన గొప్పకవి గురజాడ అని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కావలసిన పుస్తకాలు గురించి గ్రంథాలయ అధికారి దమయంతిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పుస్తకాలను పంపిస్తానని హామీచ్చారు. గ్రంథాలయ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ సేవలను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.