అనకాపల్లికి చేరుకున్న ఆటోడ్రైవర్‌ పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లికి చేరుకున్న ఆటోడ్రైవర్‌ పాదయాత్ర

Sep 5 2025 5:42 AM | Updated on Sep 5 2025 5:42 AM

అనకాపల్లికి చేరుకున్న ఆటోడ్రైవర్‌ పాదయాత్ర

అనకాపల్లికి చేరుకున్న ఆటోడ్రైవర్‌ పాదయాత్ర

అనకాపల్లి: సీ్త్రశక్తి పథకంలో భాగంగా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో డ్రైవర్‌ చింతకాయల శ్రీను ఈ నెల 2న విశాఖ నుంచి విజయవాడకు తలపెట్టిన పాదయాత్ర గురువారం స్థానిక నెహ్రూచౌక్‌కు చేరుకుంది. ఆయనకు ఏపీ ఆటో డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణ సంఘీభావం తెలియజేశారు. పాదయాత్ర ఈ నెల 20న విజయవాడ చేరుకుంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరిబిల్లి జగదీష్‌, సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాబునాయుడు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement