
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
● వైఎస్సార్ సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనురాధ
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆ పార్టీ జోన్–1(ఉత్తరాంధ్ర జిల్లాల) మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఈర్లె అనురాధ అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈర్లె అనురాధను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీనైన తనకు వైఎస్సార్ సీపీలో వివిధ పదవులు కల్పించారని చెప్పారు. తనపై నమ్మకంతో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన పదవికి తగిన న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్ సీపీ నుంచి కె.కోటపాడు జెడ్పీటీసీగా గెలిచిన అనురాధ.. పార్టీలో అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలిగా, మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్తగా, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.