
మైరెన్ పోలీస్ స్టేషన్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్ విజయ కృష్ణన్
తీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: తీర ప్రాంత రక్షణకు, మైరెన్ పోలీస్ స్టేషన్ల పటిష్టతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి తీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైరెన్ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు ప్రహరీలు, మరుగుదొడ్లు, బెంచీలు నిర్మించడంతో పాటు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. బోట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు, సీసీ కెమెరా ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే రోజుల్లో గజ ఈతగాళ్లను తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైరెన్ పోలీస్ స్టేషన్ల అధికారులు, మత్స్య,పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.