
పులివెందులలో టీడీపీ గుండాల దాడులు దుర్మార్గం
● ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణుల రౌడీయిజం ● మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విమర్శ
దేవరాపల్లి: కడప జిల్లా పులివెందుల మండలంలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడులు చేయడం దుర్మార్గమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ నల్లగొండువారి పల్లె గ్రామంలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వెల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇతర నాయకులపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేక ప్రజలను, వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పటడం సరికాదన్నారు.