
యువకుడిపై దాడి
గొలుగొండ: చీడిగుమ్మల గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన రామమూర్తినాయుడు, శ్రీను టెంట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రీనుకు మద్దతుగా అదే గ్రామానికి చెందిన గోవింద్, మరో యువకుడు రామమూర్తినాయుడిపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలు పాలైన ఆయనను స్థానికులు వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన ముగ్గురిపై మంగళవారం రామమూర్తినాయుడు గొలుగొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.