
అట్రాసిటీ కేసులపై తక్షణం స్పందించాలి
● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ ● కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం
తుమ్మపాల: ఎస్సీల అభ్యున్నతి లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ కోరారు. అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించా రు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, తదితర జిల్లా అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ సామాజిక వ ర్గాల్లో అక్షరాస్యత పెంపు, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం వంటి అంశాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి పురోగతిని, గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా ని ఘా వంటి విషయాలను ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలన్నా రు. ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు పూ ర్తి పని దినాలు కల్పించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు సహకారం అందించాల్నారు. అట్రాసిటీకి సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ న మోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకోసారి తప్పనిసరిగా జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమావేవం అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ కేసులను నీరు కారుస్తున్న పోలీసులు
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేసి, కేసును నీరుకార్చే విధంగా ఉన్న పోలీసుల విధి విధానాలను మార్పు చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్‌కు ఉమ్మడి విశాఖ జిల్లా డీవీఎంసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం వినతిపత్రం అందించారు. అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక అంబేడ్కర్ భవనం, అంబేడ్కర్ విగ్రహం, ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఎస్సీ, ఎస్టీ కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధుబాబు, ఎం.అప్పలరాజు, అంబేడ్కర్ భవనం చైర్మన్ బొడ్డు కళ్యాణరావు, కార్యదర్శి జె.సి.ప్రభాకర్, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య పాల్గొన్నారు