
హాస్టల్ దుస్థితిపై హైకోర్టు సీరియస్
నర్సీపట్నం: ఇక్కడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో సౌకర్యాల లేమిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది అ క్టోబర్ నెలలో మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ నియోజకవర్గంలోని పలు వసతిగృహాలను పరిశీలించారు. అ ప్పుడు నర్సీపట్నం ఎస్సీ బాలికల వసతిగృహంలో మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేని విషయాన్ని గమనించారు. అప్పటికీ ఒక్కటి మాత్రమే నిర్వహణలో ఉంది. ఇదే విషయం ఆయన ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సమస్యలతోపాటు ఈ సమస్యను హైకోర్టు ప్రత్యే కంగా గుర్తించింది. ఈనెల 21న సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి స్వయంగా తమ ఎదుట హాజరై తీసుకోబో యే చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
రెట్టింపు సంఖ్యలో విద్యార్థినులు
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం 120 మంది విద్యార్థినులు ఉండేందుకు వీలుగా ఈ వసతిగృహాన్ని నిర్మించారు. ప్రస్తుతం 228 మంది బాలికలు ఇక్కడ ఉంటున్నారు. వీరిలో ఉన్నత పాఠశాల విద్యార్థినులు 170 మంది కాగా, 58 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు. వాస్తవానికి కాలేజీ విద్యార్థినుల హాస్టల్ ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంది. వసతిగృహంలో పది మరుగు దొడ్లు, మరో పది స్నానాల గదులు ఉన్నాయి. చాలక కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే వీటిన్నింటికీ మరమ్మతులు పూర్తి చేశారు. అయినప్పటికీ మూడు మరుగుదొడ్లు బాగులేవని విద్యార్థినులు వినియోగించటం లేదు.
సౌకర్యాల లేమిపై న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నివేదికపై స్పందన
సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం