గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుందరకోట పంచాయతీకి విచ్చేశారు. అక్కడ జరిగిన గ్రామసభలో అర్ధంతరంగా ఆగిపోయిన గిరిజనుల అటవీ హక్కుపత్రాల పంపిణీ విషయాన్ని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి స్పీకర్‌ వద్ద ప్రస్తావించారు. వాటితో పాటు సరుగుడు | - | Sakshi
Sakshi News home page

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుందరకోట పంచాయతీకి విచ్చేశారు. అక్కడ జరిగిన గ్రామసభలో అర్ధంతరంగా ఆగిపోయిన గిరిజనుల అటవీ హక్కుపత్రాల పంపిణీ విషయాన్ని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి స్పీకర్‌ వద్ద ప్రస్తావించారు. వాటితో పాటు సరుగుడు

Jul 14 2025 5:15 AM | Updated on Jul 14 2025 5:15 AM

గత ఏడ

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

హక్కుపత్రాలు ఇంకెప్పుడిస్తారు...!

గ్యాప్‌ ఏరియా భూముల్లో సాగు చేసే గిరిజనుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

గత ప్రభుత్వంలో 580 మందికి పైగా హక్కుపత్రాల పంపిణీ

అధ్యక్షా...

అప్పుడే మరిచారా...!

నాడు ఆశలు నెరవేర్చారు...

గత వైఎస్సార్‌సీపీ హయంలో అటవీ హక్కు పత్రాలు పొందిన గిరిజనులందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో పెట్టుబడి ఆర్థిక సాయం అందుకున్నారు, ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములకు అసలు పట్టాలు వస్తాయనే ఆశ గిరిజనులకు ఉండేది కాదు. అటువంటి దశలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ కృషితో పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు నిబంధనల ప్రకారం పట్టాలు అందజేశారు. సరుగుడు, సుందరకోట పంచాయతీలో అసనగిరి, తొరడ, కొత్త దద్దుగుల, మాసంపల్లి , రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, సిరిపురం, ముంతమామిడిలొద్దు, కొత్త లంకలు, బమ్మిడికలొద్దు, దద్దుగుల తదితర గ్రామాలు 1/70 యాక్టు పరిధిలో ఉన్నాయి. ఆ గ్రామాల గిరిజనులు గ్యాప్‌ ఏరియా భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటారు. మొదట తరం గిరిజనులు కాలం చేసేయడంతో వారు వారసులు అయా భూములు సాగు చేస్తున్నారు. మేము ఉండగా హక్కు పత్రాలు ఇస్తారా...అంటూ గిరిజన పెద్దలు మదన పడుతున్నారు.

నాతవరం :

గిరిజనులు సాగుచేసే భూములకు పట్టాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో వందలాది మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వగా, ఆ తరువాత వచ్చిన ఎన్నికల కోడ్‌ కారణంగా మిగిలిన రైతులకు పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గిరిజనుల గోడును పూర్తిగా పెడచెవిన పెట్టింది... వివరాలివి.

మండలంలో సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో సుమారుగా 10వేల ఎకరాలకు పైగా గ్యాప్‌ ఏరియా భూమి ఉంది, బ్రిటిష్‌ హయంలో సైతం సర్వే చేయకపోవడంతో ఈ భూమి గ్యాప్‌ ఏరియా భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఆయా భూముల్లో గిరిజనులు స్వాతంత్య్రం నాటి నుంచి తుప్పలు రాళ్లు తొలగించి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గిరిజనులు సాగు చేసుకునే అటవీ పోడు భూములకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో సర్వే చేశారు. పోడు వ్యవసాయం చేసుకునే వారిని గుర్తించి రెండు దఫాలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న గిరిజనులకు సుమారుగా 589 మందికి అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ చేతుల మీదుగా అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. అన్ని అర్హతలు ఉండి సర్వే చేసిన మరో 300మంది పైగా గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికడ కోడ్‌ రావడంతో పట్టాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వం రాకతో ఈ అంశాన్ని అధికారులు పక్కన పడేసారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుందరకోట పంచాయతీకి విచ్చేయగా, అక్కడ జరిగిన గ్రామసభలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సరుగుడు సుందరకోట పంచాయతీలో గ్యాప్‌ ఏరియా భూముల్లో పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్‌ స్పందించి వెంటనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సుందరకోట పంచాయతీలో గల గ్యాప్‌ ఏరియా భూములను ఫిబ్రవరిలో కలెక్టరు విజయకృష్ణన్‌ పరిశీలించారు. గ్యాప్‌ ఏరియా భూములతో పాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం నమోదు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, సర్వే అధికారులను అదేశించారు, గ్యాప్‌ ఏరియా సర్వే యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు అదేశించారు. ఈ సమయంలో కూడా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఎంపీపీ లక్ష్మణమూర్తి కలెక్టర్‌ను కలిసి గిరిజనులు హక్కు పత్రాల కోసం విజ్ఞప్తి చేయగా, సర్వే పూర్తయ్యాక పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ చెప్పారు. అయితే స్పీకర్‌, కలెక్టరు హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా నేటికీ గిరిజనులకు ఎదురు చూపులు తప్పలేదు. హక్కు పత్రాల పంపిణీ జరగలేదు. సాక్షాత్తూ స్పీకర్‌ హామీ ఇచ్చినా నెరవేరకపోతే మా సమస్య ఇంకెవరికి చెప్పుకోవాలంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

384 మందిని గుర్తించాం.

పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను నిబంధనలు ప్రకారం 384 మందిని గుర్తించాం. ఆ జాబితా అటవీశాఖ అధికారులకు పాడేరు ఐటీడీఏకు నివేదించాం. అటవీశాఖ అధికారులు ఆమోదం తెలిపాక పాడేరు ఐటీడీఏ ద్వారా పాసుపుస్తకాలు వస్తాయి. రెవెన్యూ శాఖ పరంగా మేము జాప్యం చేయలేదు. అటవీశాఖలో జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గిరిజనులకు మేలు కోసం మా పని సకాలంలోనే చేసేయడం జరిగింది,

–ఎ.వేణుగోపాల్‌, తహసీల్దార్‌, నాతవరం మండలం

గతంలో రైతు భరోసా అందింది

మాకు పట్టాలు పాసుపుస్తకాలు వస్తాయి అనుకోలేదు. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. హక్కు పత్రాలు పొందిన గిరిజనులందరికీ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం డబ్బులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇంకా రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు.

–బండి గంగరాజు, సరుగుడు గ్రామం

గిరిజనులపై వివక్ష

కూటమి ప్రభుత్వంలో గిరిజనులు తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారు. అధిక శాతం గిరిజనులు వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటర్లు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. హక్కు పత్రాల కోసం స్వయంగా గ్రామసభలో అందరి సమక్షంలోనే స్పీకరు అయ్యన్నపాత్రుడు దృష్టికి, తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన కలెక్టరు విజయకృష్ణన్‌కు ఈ సమస్య తీసుకెళ్లాను, త్వరలోనే పరిష్కరిస్తాను అన్నారు కానీ నేటికీ జరగలేదు.

–సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా1
1/5

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా2
2/5

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా3
3/5

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా4
4/5

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా5
5/5

గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement