
సంచార చికిత్స కేంద్రాలతో మెరుగైన వైద్యం
● డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి
సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి
తుమ్మపాల: సంచార చికిత్స కేంద్రాలతో గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. మండలంలో వెంకుపాలెంలో సంచార చికిత్స కార్యక్రమాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీ, పలు రకాల సేవలపై రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సంచార చికిత్స కేంద్రాల ద్వారా వైద్య పరిక్షలతోపాటు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని వారి సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం కోసం పీహెచ్‌సీల ద్వారా ఉన్నత ఆస్పత్రులకు వైద్యులు సిఫార్సు చేస్తున్నారని, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా తక్షణమే పీహెచ్‌సీలకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తగరంపూడి పీహెచ్‌సీ డాక్టర్ పావని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.