
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో తాగునీటి సమస్యలపై చర్చిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం : తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.రామస్వామి, డిప్యూటీ ఇంజినీర్ ఎం.జయరామ్, నాలుగు మండలాలకు చెందిన జేఈలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచే తాగునీటి వ్యవస్థను మెరుగుపరిస్తే వచ్చే ఏడాది వేసవిలో ఇబ్బందులు ఉండవని సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని, సమస్యలు ఉన్న గ్రామాల్లో పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైన నిధులను తీసుకురావడానికి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని స్పీకర్ చెప్పారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. సమగ్ర నివేదికను తయారు చేసి నివేదించాలని అధికారులకు సూచించారు.