
ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వేదికపై కార్పొరేషన్ చైర్మన్లు
మాట్లాడుతున్న ఎంపీపీ గొర్లి సూరిబాబు, అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ పీలా గోవింద్
అనకాపల్లి టౌన్: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన 17వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాములు వేదికపై కూర్చున్నారు. అనుకోని అతిథులను వేదికపై చూడడంతో మండల పరిషత్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్నా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు ఎంపీపీ బదులు చెప్పేలోపే పీలా గోవింద్ తనదైన శైలిలో బదులిచ్చేవారు. వాస్తవానికి ప్రజల నుంచి ఎన్నికై న సభ్యులు మాత్రమే వేదికపై కూర్చోవాలి. కానీ అందుకు విరుద్ధంగా కూటమి నాయకులు అధికార బలంతో సమావేశ వేదికపై కూర్చోవడంతో చివరిలో వారికి సన్మానాలు కూడా చేసి గౌరవించారు.