
●భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
ధ్యానమూలం గురుమూర్తిః పూజమూలం గురుపదం
మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా..
జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని షిర్డీ సాయి ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. బలిఘట్టం పాకలపాడు గురువుగారు ఆశ్రమంలో గురుపౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి పూజలు ఆచరించడం ద్వారా జాతక దోషాలు తొలగితాయని భక్తుల విశ్వాసం.
అలాగే కొత్తపెంట దేవానంద స్వామీజీ ఆశ్రమంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవానంద స్వామీజీని దర్శించుకున్నారు.

●భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి