
అడ్డురోడ్డులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్
అడ్డురోడ్డు సీసీ కెమెరా కంట్రోల్ రూమ్‌ను పరిశీలిస్తున్న హోంమంత్రి
ఎస్.రాయవరం: రోడ్డు ప్రమాదాలు , నేరాలు నివారణకు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో 100 సీసీ కెమెరాలు నిర్వహణ కంట్రోల్ రూం గురువారం ప్రారంభించారు. పాయకరావుపేట తాండవ జంక్షన్ నుంచి ధర్మవరం అగ్రహారం వరకు ప్రధాన జంక్షన్‌లలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మహిళల భద్రత కోసం అవసరమయ్యే 10 ఈవీ ద్విచక్ర వాహనాలను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ జిల్లా అంతా నేరాలు అదుపునకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.