
న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు సత్కారం
చోడవరం : స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రత్నకుమార్ బదిలీ కావడంతో ఆయనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రత్నకుమార్ విశాఖపట్నం 12వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా కాకినాడను నుంచి హరినారాయణను బదిలీ చేశారు. ఈ సందర్భంగా రత్నకుమార్‌కు వీడ్కోలు సభను నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామిరెడ్డి వెంకటరావు అధ్యక్షతన ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి నరేష్, చోడవరం సబ్ జడ్జి గౌరీశంకర్ , ఫస్ట్ క్లాస్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సూర్యకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నకుమార్‌ను బార్ అసోసియేషన్ శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. చోడవరం బార్ అసోసియేషన్ సహకారం మరువలేనిదని న్యాయమూర్తి రత్నకుమార్ అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, ప్రతినిధులు ఉగ్గిన వెంకట్రావు, అల్లు గిరిధర్, కాండ్రేగుల డేవిడ్, కె.భాస్కర్‌దాస్, గూనూరు లక్ష్మీనారాయణ, ఎన్.సుబ్బలక్ష్మి, జి.వి.పి రాజు, గోవిందు, పప్పల రమణమూర్తి, వరలక్ష్మి, సత్యవతి, అప్పర్ల పాల్గొన్నారు.