
పారిశుధ్య సమస్యకు తొలి ప్రాధాన్యం
●నూతన జోనల్ కమిషనర్ చక్రవర్తి
అనకాపల్లి టౌన్: పారిశుధ్య సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని జీవీఎంసీ నూతన జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి తెలిపారు. ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన అనుభవం ఉందని, అనకాపల్లి పట్టణంలోని పరిస్థితులు తనకు తెలసునన్నారు. సమస్యలపై ప్రజలు తనను నేరుగా కలవచ్చన్నారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ప్ర జల సహకారంతో పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విశాఖపట్నంలో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్‌పై జోనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు మాతృశాఖ నుంచి అనుమతి లభించింది.