
11న వ్యవసాయ యాంత్రీకరణ మేళా
రైతులకు సూచనలిస్తున్న మోహన్‌రావు
నర్సీపట్నం: పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఈ నెల 11న వ్యవసాయ యాంత్రీకరణ మేళాను ఏర్పాటు చేసినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు తెలిపారు. వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మేళా ఏర్పాటుకు అవసరమైన యార్డులోని ప్రదేశాన్ని మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్యనాయుడు, ఏడీఏ శ్రీదేవి, యార్డు సెక్రటరీ భువనేశ్వరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు అవసరమైన 23 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 33 వేల టన్నుల యూరియాను సిద్ధం చేశామన్నారు. 11 డ్రోన్లు మంజూరయ్యాయని, వీటిలో 7 డ్రోన్లను రైతులకు అందజేశామన్నారు.
ప్రకృతి సాగుపై మొగ్గు చూపాలి
మాకవరపాలెం: ప్రకృతి సాగుపై రైతులు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు సూచించారు. పొలం పిలుస్తోందిలో భాగంగా మండలంలోని నారాయణరాజుపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. పాయకరావుపేట ఏడీ ఉమాప్రసాద్, ఏవో అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.