
మువ్వల ప్రసాద్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం
మువ్వల చిన్నకు రూ.5 లక్షల చెక్కు అందజేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ 2020లో మరణించిన జగన్నాథపురానికి చెందిన మువ్వల ప్రసాద్ కుటుంబానికి కలెక్టర్ విజయ కృష్ణన్ రూ.5 లక్షల చెక్కు అందజేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడు ప్రసాద్ తల్లి చిన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో మువ్వల చిన్నకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు.