
సందడిగా లాఫింగ్ క్లబ్ ‘కామెడీ కింగ్స్’ కార్యక్రమం
ఆనంద్‌రాజ్‌ను సత్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్
అనకాపల్లి: నువ్వులు మానవ శరీరానికి ఎంతో ఉత్సహాన్ని కలిగిస్తుందని, నిత్యం జీవితంలో నవ్వడం ప్రకృతి ఇచ్చిన వరంలాంటిదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ అన్నారు. స్థానిక గవరపాలెం మళ్ల జగన్నాథం కల్యాణమండపంలో లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ‘కామెడీ కింగ్స్’ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించగా, సౌత్ ఇండియా ఫేమస్ యాక్టర్ ఆనంద్‌రాజ్‌ను శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి ఆదివారం నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు యాక్టర్ ఆనంద్‌రాజ్ తన నటించిన చిత్రాల్లో కామిడీని వినిపించి నవ్వుల జల్లులు కురిసేలా చేశారు. ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు విల్లూరి వీరసంతోష్, ఉపాధ్యక్షుడు బుద్ద ప్రవీణ్‌కుమార్, 80వ వార్డు ఇన్‌ఛార్జ్ కెం.ఎ.నాయుడు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.