
రైవాడ జలాశయంలో చేపల వేట నిషేధం
● జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ
రైవాడ జలాశయం
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో చేపల వేటను వచ్చేనెల 31 వరకు నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి జి. విజయ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన చేపల వేట నిషేధం ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. నిబంధనలను అతిక్రమించి వేట సాగిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అపరాధ రుసుం విధిస్తామని ఆమె హెచ్చరించారు.