
డాక్టర్ దేముడుబాబుకు అరుదైన పురస్కారం
బెస్ట్ న్యూరో ఫిజీషియన్ అవార్డు గ్రహీత దేముడుబాబును సత్కరిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు
దేవరాపల్లి: మండలంలో కాశీపురానికి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ బొడ్డు దేముడుబాబుకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ప్రసిద్ధి గాంచిన టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండియా జాతీయ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను ఎంపిక చేసింది. డాక్టర్స్ డే సందర్భంగా వారందర్నీ దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ దేముడుబాబు ఒక్కరికే ఈ అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర మంత్రి జె.పి నడ్డా చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న దేముడుబాబును కాశీపురంలో బుధవారం స్ఫూర్తి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఓ మారుమాల ప్రాంతంలో జన్మించి దేశంలోనే గొప్ప న్యూరో ఫిజియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో కాశీపురం గ్రామస్తులతో పాటు ఉమ్మడి విశాఖలోని సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి గొప్ప వైద్యుడిగా అరుదైన అవార్డు పొందడం తమ గ్రామానికి గర్వకారణమని కాశీపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
● బెస్ట్ న్యూరో ఫిజీషియన్‌గా ఢిల్లీలో అవార్డు స్వీకారం

డాక్టర్ దేముడుబాబుకు అరుదైన పురస్కారం