నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొత్త తరహా నేరాలను సైతం సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఇట్టే ఛేదిస్తున్నారు. దీంతో బాధితులకు త్వరగా ఊరట కలగడమే కాకుండా.. నిందితుల వెన్నులో వణుకు పుడుతుంది. క్రైం రేటు తగ్గుతుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఆ | - | Sakshi
Sakshi News home page

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొత్త తరహా నేరాలను సైతం సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఇట్టే ఛేదిస్తున్నారు. దీంతో బాధితులకు త్వరగా ఊరట కలగడమే కాకుండా.. నిందితుల వెన్నులో వణుకు పుడుతుంది. క్రైం రేటు తగ్గుతుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఆ

May 24 2025 1:19 AM | Updated on May 24 2025 1:19 AM

నేర ప

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొ

సాక్షి, అనకాపల్లి: ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానమని చెప్పడమే గానీ వీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో, పార్లమెంట్‌ సభ్యుడి అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో జిల్లావ్యాప్తంగా 2 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. రెండు నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేదు. సీసీ కెమెరాల రూపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో జిల్లాలో నేరాల సంఖ్య అదుపులోకి రావడం లేదు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి మినహా ప్రధాన పట్టణాల్లో సీసీ కెమెరాల నిఘా కరువైంది. అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పరవాడ–రాంబిల్లి–అచ్యుతాపురం సెజ్‌లో సీసీ కెమెరాలే ఏర్పాటు చేయలేదు. అక్కడ ప్రైవేట్‌ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే దిక్కు. సెజ్‌లో ప్రధాన కూడలిలో కూడా సీసీ కెమెరాలు లేకపోవడమే కాకుండా కొన్ని చోట్ల ఉన్న ప్రైవేట్‌ సీసీ కెమెరాలు పోలీస్‌ కంట్రోల్‌ రూం పర్యవేక్షణలో లేవు. జిల్లాలో 258 ప్రభుత్వ సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అందులో సగం మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం గుర్తించిన దొంగలు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇళ్లలో యథేచ్ఛగా చోరీలు చేస్తున్నారు.

ప్రైవేట్‌ సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన

జిల్లాలో ప్రధాన పట్టణాలైన అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరంతో పాటు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న అడ్డురోడ్డు, నక్కపల్లి, జంక్షన్‌ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కాలనీలతో పాటు, అపార్ట్‌మెంట్లలో కూడా ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలి. వాటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించాలి. సీసీ కెమెరాలు ప్రారంభించిన సమయంలో కొద్ది రోజులపాటు బాగానే పనిచేశాయి. నేరాలను నియంత్రించగలిగారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన రహదారుల్లో మాత్రమే కెమెరాలు పనిచేస్తున్నాయి. పలు కాలనీల్లోనూ పనిచేయడం లేదు. ప్రైవేట్‌ యాజమాన్యాల వారు సహకరించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. రెండేళ్ల క్రితం ప్రధాన పట్టణాల్లో ప్రైవేట్‌ యాజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అవి కొనసాగితే నేరాలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది.

వాహనాల వేగానికి ముకుతాడు

జిల్లా వ్యాప్తంగా 258 ప్రభుత్వ సీసీ కెమెరాలుండగా... వాటిలో ఏపీ క్లౌడ్‌ బేస్డ్‌ సీసీ కెమెరాలు 158, ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌) కెమెరాలు 100 ఉన్నాయి. ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను హైవేలలో ప్రధాన కూడళ్లలోనూ ...సిటీ ప్రధాన రహదారి కూడలిలో ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల నెంబర్‌ ప్లేట్‌ని జూమ్‌ చేస్తుంటాయి. ఈ సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాల్లో తప్పించుకునే వాహనాలు, చోరీలను ఛేదించగలుగుతారు. వీటి వల్ల వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం పడుతుంది. వీటితోపాటు క్లౌడ్‌ బేస్డ్‌ సీసీ కెమెరాల సంఖ్యను పెంచాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ సీసీ కెమెరాలు దాదాపుగా 1500కి పైగా ఉన్నాయి.

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కనిపించని సీసీ కెమెరాలు

ప్రైవేట్‌ వ్యక్తులు, వ్యాపారులు ఏర్పాటు చేసిన కెమెరాలే దిక్కు

ప్రభుత్వం ఏర్పాటు చేసినవి 258.. అందులో పనిచేసేవి సగమే

నిఘా లేక పెరుగుతున్న నేరాలు

మరిన్ని కెమెరాల ఏర్పాటుకు కృషి

సీసీ కెమెరాల ద్వారా అనేక నేరాలను ఛేదించాం. ఇటీవల కిడ్నాప్‌నకు గురైన చిన్నారి లోహితను కూడా సీసీ కెమెరాల సాయంతోనే పట్టుకొని తల్లి వద్దకు చేర్చాం. జిల్లాలో దాదాపుగా అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా పనిచేయనివి ఉంటే వాటిని గుర్తిస్తాం. అంతేకాకుండా పట్టణాల్లో ప్రధాన వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్‌ సంస్థల సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అపార్ట్‌మెంట్లలో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. సీసీ కెమెరాల నిఘాతో నేరగాళ్లకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఎవరూ చూడలేదు కదా అని నేరాలకు పాల్పడితే సీసీ కెమెరాల్లో బందీకాక తప్పదు. స్పీడ్‌ డ్రైవింగ్‌, చైన్‌స్నాచింగ్‌, హత్య కేసులు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడే వారిపై సీసీ కెమెరాలు ఎప్పుడూ నిఘా ఉంచుతాయి. పట్టణాల శివారు ప్రాంతాల్లో గల నిర్మానుష్య ప్రాంతాల్లో, ప్రైవేట్‌ ఆర్గనైజేషన్స్‌, షాపులు, ఇతర ప్రైవేట్‌సంస్థల వద్ద మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

– మోహన్‌రావు, అడిషనల్‌ ఎస్పీ (క్రైం)

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొ1
1/2

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొ

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొ2
2/2

నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement