ఏలేరు–తాండవ జలాశయాల పరిధిలో ఆయకట్టు
అనకాపల్లి జిల్లాలో 34,518 ఎకరాలు కాకినాడ జిల్లాలో...16,947 ఎకరాలు వీటి పరిధిలో చెరువులు: 198 చెరువుల కింద ఆయకట్టు: 17 వేల ఎకరాలు జలాశయం నీటిమట్టం: 4,400 ఎంసీఎఫ్‌టీలు ఎడమ ప్రధాన కాలువ పొడవు: 19.8 కిలోమీటర్లు కుడి ప్రధాన కాలువ పొడవు: 15.4 కిలోమీటర్లు
రెండు జిల్లాలు సస్యశ్యామలం
రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ఈ పథకానికి అడుగులు పడినప్పటికీ, పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి రైతులకు మేలు చేకూర్చాలి. ఈ పథకం పూర్తయితే రెండు జిల్లాలు సస్యశ్యామలవుతాయి. పథకాన్ని పూర్తి చేసి తాండవ జలాశయం ఆయకట్టు రైతుల చిరకాలను నెరవేర్చాలి.
–అడిగర్ల రాజు, సీఐటీయూ నాయకుడు
రైతులకు మేలు
ఒక్కొక్కసారి వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా వర్షాలు పడకపోవటం వల్ల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉండటం లేదు. పంటకు నీరు అందక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆయకట్టు రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. రాజకీయాలకు అతీతంగా కూటమి పథకాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి
–తాతాజీ, రైతు, మెట్టపాలెం
తాండవ జలాశయం
●
జల కళ కలగా మిగిలేనా..?