
వడ్డాది వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
వడ్దాది వేంకటేశ్వరస్వామి ఆలయంలో కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది
బుచ్చెయ్యపేట : వడ్దాది వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 152 కల్యాణోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాలు సందర్బంగా ఈ నెల 10 వ తేది నుంచి 15 వరకు భక్తులు సమర్పించిన హుండీ లెక్కింపులు సోమవారం నిర్వహించారు. ఆలయ ఈవో శర్మ వారి సిబ్బందితో కలిసి లెక్కించిన హూండీ ఆదాయంలో గత ఏడాది కంటే స్వామి వారికి రూ 2,67,640 ఆదాయం అధికంగా వచ్చింది. హుండీల్లో రూ.7,86,406 నగదు వచ్చింది. టిక్కెట్ల ద్వారా రూ 4,08,665, తలనీలాల ద్వారా రూ.25వేలు, కొబ్బరి చిప్పలు వేలం ద్వారా రూ 38వేలు, ఆశీలు ద్వారా రూ 9,160, విరాళాలు ద్వారా రూ. 8435, మెత్తం రూ.12,75,666 ఆదాయం వచ్చిందని ఈవో శర్మ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర ధర్మకర్త దొండా కన్నబాబు, ఎస్‌ఐ శ్రీనివాసరావుతో పాటు స్థానిక పెద్దలు దొండా సన్యాసిరావు, దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు.